మంచిర్యాలఅర్బన్: వివాహాలు, గృహప్రవేశాలు, పుట్టినరోజు వేడుకలు తదితర శుభకా ర్యాల్లో రాములోరి తలంబ్రాలు వాడటం శు భప్రదమని ఆర్టీసీ మంచిర్యాల డీఎం శ్రీనివా సులు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల బస్టాండ్‌లో రాములోరి తలంబ్రాల పంపిణీ పై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలంలోని సీతారాముల కల్యాణ తలంబ్రాలు అత్యంత విశిష్టమైనవని చెప్పారు. రాములోరి తలంబ్రాలను భక్తులకు చేరవేసేందుకు కార్గో ద్వారా ముందుస్తు బుకింగ్‌కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు మంచిర్యాల కార్గో సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు వెంకటేశ్వర్లు, మాధవి, భారతి తదితరులున్నారు.


