ఈద్‌ ముబారక్‌ | - | Sakshi
Sakshi News home page

ఈద్‌ ముబారక్‌

Mar 22 2026 5:32 AM | Updated on Mar 22 2026 5:32 AM

● భక్తిశ్రద్ధలతో రంజాన్‌ వేడుకలు ● ఈద్గాలు, మసీదుల వద్ద ప్రార్థనలు

జైపూర్‌: ఇందారంలో సర్పంచ్‌ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

మంచిర్యాలఅర్బన్‌/జైపూర్‌: జిల్లా కేంద్రంలో రంజాన్‌ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. నెలపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసదీక్షలు చేసి శనివారం ఉదయం నుంచే మంచిర్యాల బస్టాండ్‌, ఆండాళమ్మ కాలనీ వద్ద గల ఈద్గాలు, ఆయా ప్రాంతాల్లోని మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు సందేశమిచ్చారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు తదితరులు ఈద్గాల వద్దకు చేరుకుని ముస్లింలను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్‌ మండల కేంద్రంతోపాటు ఇందారం, టేకుమట్ల తదితర గ్రామాల్లోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి ఇందారం సర్పంచ్‌ ఎండీ ఫయాజొద్దీన్‌ ఇంట్లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement