మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమంలో బట్టు సత్తవ్వ(65) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా, మృతదేహాన్ని కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సభ్యులు మాట్లాడుతూ ఆశ్రమంలోనే 12 ఏళ్లుగా ఉంటున్న సత్తవ్వకు అనారోగ్యం బారినపడిందన్నారు. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా మృతి చెందిందన్నారు. కూతురు మాధవి, అల్లుడు ప్రభాకర్‌గౌడ్, తమ్ముడు రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆమె భౌతికకాయాన్ని చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్‌రెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్ వి. మధుసూదన్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, కాసర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.


