జన్నారం: పర్యావరణం, అడవులు, వన్యప్రాణులు సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. పచ్చదనంతోనే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అడవిపై గొడ్డలివేటు ఈప్రక్రియకు ఆటంకం కలిగిస్తోంది. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
వన్యప్రాణుల కలయికకు నిలయం
ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ విభిన్న జీవవైవిధ్యానికి నిలయంగా మారుతుంది. సుమారు 2,015 చదరపు కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కవ్వాల్ అడవి, అ రుదైన వృక్ష సంపద, వన్యప్రాణులకు నిలయం. ఇ క్కడి టేకు అడవులు రాష్ట్రంలోనే నాణ్యమైనవిగా పే రుగాంచాయి. 2012లో కవ్వాల్ అభయారణ్యాన్ని కేంద్రప్రభుత్వం ’టైగర్ రిజర్వ్’గా ప్రకటించింది. ఇక్కడ కేవలం పులులే కాకుండా చిరుత, జింకలు, సాంబార్, అడవి దున్నలు, ఎలుగుబంట్లు అడవి పందులు తదితర వన్యప్రాణులు, సరిసృపాలు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఇటీవల నిర్వహించిన పక్షుల గణనలో ఇక్కడ వందలాది జాతుల పక్షులు, విదేశీ వలస పక్షులు సందడి చేయడం విశేషం.
జీవవైవిధ్యంలో ముఖ్యపాత్ర
అడవులు భూమికి ఊపిరితిత్తులు లాంటివి. కార్బన్ డై ఆకై ్సడ్‌ను తీసుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందిస్తుంది. మనిషి మనుగడకు దోహదపడే అడవులు జీవవైవిధ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పక్షులు, జంతువులు, వివిధ రకాల కీటకాలను అ వాసాలుగా మారిన అడవులు అంతరించిపోతే అనర్థాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. పిచుకలు అంతరించిపోవడం వల్ల మిడుతలు వచ్చినట్లు, కరోనా లాంటి కొత్త వైరస్‌లు పుట్టుకొస్తాయి. ప్రాణకోటికి అవాసంగా ఉన్న అడవుల రక్షణ అత్యంత అవసరం.
పెరిగిన అడవుల శాతం
గతంతో పోలిస్తే కవ్వాల్ టైగర్‌జోన్ ప్రాంతంలో అడవుల శాతం పెరిగాయి. రాష్ట్రం ఏర్పడక ముందు పోడు సాగుకు, స్మగ్లింగ్ కోసం అడవులు నరికివేతకు గురయ్యాయి. దీంతో అడవుల శాతం తగ్గుతూ వచ్చింది. 2020 ముందు 21 శాతానికి పడిపోయింది. రాష్ట్రం ఏర్పాటు నుంచి ప్రస్తుతం 21 నుంచి 33 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
పెరుగుతున్న స్మగ్లింగ్!
గతంతో పోలిస్తే కవ్వాల్ టైగర్‌జోన్‌లోని పలు ప్రాంతాల్లో స్మగ్లింగ్ పెరిగినట్లు తెలుస్తోంది. జన్నారం అటవీ డివిజన్‌లో ఆరు నెలల్లో సుమారు రూ.5లక్షల పైగా కలప స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో అధికారులు పలు వాహనాలను పట్టుకున్నారు.


