నార్నూర్: మండలంలోని కొత్తపల్లి హెచ్ గ్రామంలోని బంజారా జాతీయ దీక్షభూమి జనసంద్రమైంది. సేవాలాల్ మహారాజ్ దీక్ష చేపట్టిన భక్తుల మహాపాదయాత్రను దీక్షగురువు శ్రీ సద్గురు ప్రేమ్‌సింగ్ మహరాజ్ శుక్రవారం ప్రారంభించారు. రాష్టం నుంచే కాక మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో దీక్షభూమికి తరలివచ్చారు. ఈ సందర్భంగా దీక్షగురు వు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు సేవాలాల్ దీక్ష చేపట్టారని తెలిపారు. ఈనెల 27న శ్రీరామనవమి రోజు మహారాష్ట్రలోని పౌరఘడ్‌లోని పుణ్యక్షేత్రానికి వారు చేరుకుని దీక్ష విరమిస్తారని తెలిపారు. ఆధ్యాత్మిక భావంతో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
పాదయాత్రను ప్రారంభిస్తున్న ప్రేమ్‌సింగ్ మహరాజ్
యాత్రలో భక్తులు


