24 గంటల్లో చోరీ కేసు ఛేదన | - | Sakshi
Sakshi News home page

24 గంటల్లో చోరీ కేసు ఛేదన

Mar 21 2026 5:15 AM | Updated on Mar 21 2026 5:15 AM

నర్సాపూర్‌(జి): చోరీ కేసును 24 గంటల్లో ఛేదించినట్లు నిర్మల్‌ ఏఎస్పీ సాయికిరణ్‌ తెలిపారు. పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నర్సాపూర్‌ (జి) మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ కిరాణా దుకాణంలో గురువారం రాత్రి నిందితుడు రూ.4వేల నగదు, 8 సిగరెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లి, 4 సీసీ కెమెరాలు ధ్వంసం చేశాడు. యజమాని శ్రీనివాస్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బరుకుంట శ్రీరామ్‌(24) అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.3500 నగదు, 8 సిగరెట్‌ ప్యాకెట్లు, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని నిర్మల్‌ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలో మూడు చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై గణేశ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement