నస్పూర్: సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరికట్టా లని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతా రామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. గురువారం సేవ్ సింగరేణి జాత కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గ నుల వద్ద గేట్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.51 వేల కోట్లను చెల్లించకపోవడం వల్ల నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. నూతన గనులు ప్రారంభించడం లేదని, నూతన యంత్రాలను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, మనుగడ కొనసాగాలంటే ప్రభుత్వం వెంటనే రూ.51 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్‌లో సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, వైవీ రావు, సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి ఎస్‌కే బాజీసైదా, ఉపాధ్యక్షులు కొట్టె కిషన్‌రావు, సహాయ కా ర్యదర్శి మోత్కూరి కొమురయ్య, నాయకులు చంద్రమోహన్, బుచ్చయ్య, నాగభూషణం పాల్గొన్నారు.
గూడెం అర్చకుడికి ఉగాది పురస్కారం
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయ అర్చకుడు శ్రీ జక్కాపురం జయస్వామి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.


