మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
దర్శనానికి బారులుతీరిన భక్తులు
కుమురంభీం జిల్లా కెరమెరి మండలం పరందోళి పంచాయతీలోని శంకర్‌లొద్దికి గురువారం సేవాలాల్ భక్తులు, ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భోళా శంకరుడిని దర్శించుకుని పూజలు చేశారు. భోగ్ పెట్టి హోమం పూజ నిర్వహించారు. అనార్‌పల్లి మాజీ సర్పంచ్ రాథోడ్ అన్నదానం చేయగా వెంకటి తాగునీటి సౌకర్యం కల్పించారు. కాంగ్రెస్ ఆసిఫాబాద్ ఇన్‌చార్జి శ్యాంనాయక్, బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, భక్తులు రూప్‌లాల్ రాథోడ్, రాజు, అనార్‌పల్లి సర్పంచ్ జాటోత్ శారద పాల్గొన్నారు. – కెరమెరి


