కుభీర్: మండల కేంద్రమైన కుభీర్‌లో గురువారం ఉగాదిని పురస్కరించుకుని విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. మండలంలోని వస్తాదులతో పాటు మహారాష్ట్రలోని పలు గ్రామాల మల్లయోధులు పోటీల్లో తలపడ్డారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.6,100, ద్వితీయ బహుమతిగా రూ.3 వేలు అందజేశారు. పోటీలను తిలకించడానికి కుభీర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు.
భళా బాలికలు
మహారాష్ట్ర, హరియానాకు చెందిన ముగ్గురు బాలికలు బాలురతో కుస్తీ పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. హరియానాకు చెందిన సాయి సుప్రియ, పుసద్‌కు చెందిన నేహా, నాందేడ్‌కు చెందిన రోహిని ఒక్కొక్కరు రెండేసి కుస్తీలను గెలుచుకున్నారు. సదరు బాలికలను గ్రామస్తులు అభినందించి ప్రత్యేక కానుకలు అందజేశారు.


