రామకృష్ణాపూర్: హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం క్యాతనపల్లి మున్సి పల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీఆర్‌ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో ఆమైపె కేసు నమోదైన విషయం తెలిసిందే. బెయిల్ షరతుల్లో భాగంగా గురువారం ఆర్‌కేపీ పోలీస్‌స్టేషన్‌కు హాజరై సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వివేక్ ప్రజల తీర్పును గౌరవించాలని పేర్కొన్నారు. ఆమె వెంట నాయకులు సుదర్శన్‌గౌడ్, రామిడి కుమార్ తదితరులు ఉన్నారు.


