కాంగ్రెస్‌ జంబో కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ జంబో కార్యవర్గం

Mar 20 2026 8:22 AM | Updated on Mar 20 2026 8:22 AM

● ఆరుగురు మహిళలకు చోటు ● పూర్థి స్థాయి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రకటన

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ)ని అధిష్టానం పూర్తి స్థాయిలో నియమించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు స్థానం కల్పిస్తూ జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కాంగ్రెస్‌ కమిటీలను ప్రకటించారు. తమ తమ నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తల పేర్లను స్థానిక ఎమ్మెల్యేలు సూచించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి పంపిన పేర్లను తుదిగా ఖరారు చేశారు. గత నవంబర్‌లో డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగగా, తాజాగా పూర్తి స్థాయి కమిటీని 50మందితో నియమించారు. వీరిలో ఏడుగురు ఉపాధ్యక్షులు, 15మంది ప్రధాన కార్యదర్శులు, ఓ కోశాధికారి, ముగ్గురు అధికార ప్రతినిధులు, 24మంది కార్యదర్శులు ఉన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధి నుంచి కాంగ్రెస్‌ నాయకులు, సీనియర్లకు అవకాశం కల్పించారు. ఆరుగురు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని నాయకులకు చోటు దక్కింది.

ఉపాధ్యక్షులు వీరే..

బొమ్మన హరీశ్‌గౌడ్‌, సూరం రవీందర్‌రెడ్డి, ఈ.కర్ణసాగర్‌, రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, అర్కల హేమలత, ముద్దసాని వేణు, గుర్రం మోహన్‌రెడ్డి

ప్రధాన కార్యదర్శులు

గెల్లి మధు, రొడ్డ శారద, పుస్కూరి విక్రమ్‌రావు, ధర్ని సత్యనారాయణ, చెన్న సూర్యనారాయణ, భూక్య లక్ష్మణ్‌నాయక్‌, చింతల శ్రీనివాస్‌, పుల్లూరి లక్ష్మణ్‌, తిమ్మి అబుబుకర్‌, అక్కల శకుంతల, బొల్లం భీమన్న, సయ్యద్‌ ఇసాక్‌, కల్వల జగన్‌మోహన్‌రావు, వేముల క్రిష్ణ

కోశాధికారి: ముక్త శ్రీనివాస్‌

అధికార ప్రతినిధులు : అబ్దుల్‌ అజిజ్‌, కంకతి శ్రీనివాస్‌, బియ్యాల తిరుపతి

కార్యదర్శులు

పురాణం సాయిరామ్‌ కౌశిక్‌, నలిమెల స్వామి, ముదుగురి కొమురయ్య, మోర్ల సుధాకర్‌, జనార్దన్‌రెడ్డి, సుంకరి శ్రీనివాస్‌, కే.కావ్య, దాగం సుధారాణి, జమ్మికుంట విజయ్‌, చిలకాని రాజమణి, మెరుగు చైతన్య, వేల్పుల శ్రీనివాస్‌, ఆకారపు రమేశ్‌, గోనే నర్సయ్య, కిరణ్‌గౌడ్‌, గోపతి బానేశ్‌, రేగుంట రమేశ్‌, ఎండీ.ముఖరంజ, పనాస కళావతి, బొడ్డున సంధ్యారాణి, ముజఫర్‌ హైమద్‌, కొండ్రు వెంకటేశ్‌, బానోత్‌ నీలయ్య.

జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మన హరీశ్‌గౌడ్‌

ఉపాధ్యక్షుడు

సూరం రవీందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement