‘నోటీసులు లేకుండా కూల్చివేతలా?’ | - | Sakshi
Sakshi News home page

‘నోటీసులు లేకుండా కూల్చివేతలా?’

Mar 19 2026 8:28 AM | Updated on Mar 19 2026 8:28 AM

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగర అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ రోడ్డు వెడల్పు పేరిట భవన యజమానులకు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస టాకీస్‌, మార్కెట్‌ ఏరియా, రైల్వే స్టేషన్‌ రోడ్డు ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు పేరిట చేపడుతున్న కూల్చివేతలను బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం హిందూ పండుగల సమయంలో కూల్చి వేతలతో ప్రజలను ఇ బ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొట్ల అనిత, కస్తూరి నాగరాజు, మాజీ కౌన్సి లర్‌ బొట్ల సత్యం, రంగ శ్రీశైలం, పురుషోత్తం జాజు, ఆకుల అశోక్‌వర్ధన్‌, అమిరిశెట్టి రాజ్‌కుమార్‌, కర్రె లచ్చన్న, జయరామరావు, నాంపల్లి శ్రీనివాస్‌, ప్రకాశ్‌ శర్మ, పచ్చ వెంకటేశ్వర్లు, కమలాకర్‌రావు, బూర్ల చిరంజీవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement