లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

Mar 19 2026 8:28 AM | Updated on Mar 19 2026 8:28 AM

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని అన్ని స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణపై అవగాహన కల్పించే పోస్టర్లు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌, నోడల్‌ డాక్టర్‌ అరుణశ్రీ, వైద్యులు ప్రసాద్‌, సుధాకర్‌, కమిటీ సభ్యులు డాక్టర్‌ రాజ్‌కిరణ్‌, రాంప్రసాద్‌, డాక్టర్‌ ప్రశాంతి, హారిక, లింగారెడ్డి, లక్ష్మణస్వామి, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలి

మంచిర్యాలటౌన్‌: ఈ నెల 31వరకు అన్ని గ్రామాల్లో ఆశ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని డీఎంహెచ్‌వో అనిత అన్నారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుష్ఠువ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమ అవగాహన పోస్టర్లను వైద్య సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. డీపీఎంవో రాఘవయ్య, సీహెచ్‌వోలు, డీపీవో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement