మధ్యాహ్న భోజనం బాగాలేదని ఆందోళన
దండేపల్లి: మధ్యాహ్న భోజనం బాగాలేదని మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. అన్నం ప్లేట్లలో పట్టుకుని మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాల గేటు ఎదుట కొద్దిసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అన్నం ముద్దగా ఉంటోందని, కూరలు రుచిగా లేక తిలేకపోతున్నామని తెలిపారు. భోజనం సరిగా చేయకపోవడంతో సాయంత్రం ప్రత్యేక తరగతులు వినలేకపోతున్నామని పదో తరగతి విద్యార్థులు వాపోయారు. ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్‌రావు స్పందిస్తూ కొత్త బి య్యం కావడంతో అన్నం ముద్దగా అవుతోందని తెలిపారు. భోజన నిర్వాహకురాలి కుమారుడు చనిపోవడంతో రావడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో భోజనం వండిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు నచ్చలేదని, విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.


