● మాజీ ఎమ్మెల్యే యన్.దివాకర్‌రావు ● జీఎం కార్యాలయం ఎదు
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే యన్.దివాకర్‌రావు విమర్శించారు. ఒడిశాలోని సింగరేణి నైని బ్లాక్‌లో కాంట్రాక్ట్ పనుల అవకతవకలపై బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బావమరిదికి అక్రమంగా నైని బ్లాక్ టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. సింగరేణి సంస్థను జేబు సంస్థగా వాడుకుంటూ దివాళా తీయిస్తున్నారని అన్నారు. ఇటీవల మెస్సీ ఫుట్‌బాల్ క్రీడకు సింగరేణి నిధులు వెచ్చించిన ప్రభుత్వం.. సింగరేణి ఆవిర్భావ దినోత్సవానికి నిధులు లేకుండా చేసిందని అన్నారు. అనంతరం ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్‌కు మెమొరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యన్.విజిత్‌రావు, యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, యూనియన్ నాయకులు పానుగంటి సత్తయ్య, అన్వేష్‌రెడ్డి లాల, వెంకటరెడ్డి, మహిపాల్‌రెడ్డి, గొర్ల సంతోష్, తొంగల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
సైట్ విజిట్ స్కామ్‌పై విచారణ జరపాలి
బెల్లంపల్లి: సింగరేణి సైట్ విజిట్ సర్టిఫికేట్ల టెండర్ల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం ద్వారా సింగరేణి ధనాన్ని కమీషన్ల రూపంలో లూటీ చేయడానికి కుట్రలు జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ బత్తుల సుదర్శన్, బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఇ.సుందరరావు, ఎండి.హనీఫ్, కె.రాజం, దాసరి శ్రీనివాస్, మోర మానస, తాళ్లపల్లి మల్ల య్య, ఎస్.అరుణ్, సుశీల, రేవెల్లి విజయ్, బడికెల శ్రావణ్ పాల్గొన్నారు.


