నగర కమిషనర్‌గా అన్వేష్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జి.అన్వేష్‌ను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నగర కమిషనర్ సంపత్‌కుమార్‌ను వేములవాడ మున్సిపల్ కమిషనర్‌గా, అక్కడ పనిచేస్తున్న అన్వేష్‌ను మంచిర్యాలకు బదిలీ చేశారు.
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా సంపత్
బెల్లంపల్లి : బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సి పల్ కమిషనర్‌గా జంగి లి సంపత్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ తన్నీరు రమేష్‌ను ములుగు మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేయగా.. ఆయన స్థానంలో ములుగు కమిషనర్ సంపత్‌ను ఇక్కడి బదిలీ చేశారు.
నగర కమిషనర్‌గా అన్వేష్


