ఆంగ్ల ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 64 కళాశాలల్లో బుధవారం నిర్వహించిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు 6,283 మందికి గాను 5,933 మంది హాజరు కాగా 350 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 5,505 మందికి గాను 5,245 మంది హాజరు కాగా 260 మంది గైర్హాజరయ్యారు. వృత్తి కోర్సుల్లో 778 మందికి 688 మంది హాజరు కాగా 90 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఈఐవో అంజయ్య పరిశీలించారు. ఈ నెల 22న ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగనున్నాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు మరుసటి రోజు రాసే వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు.


