ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు
సారంగపూర్: మండలంలోని కుప్టి తండా వద్ద శుక్రవారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థాని కుల వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఇద్ద రు యువకులు తమ బైక్‌పై మహారాష్ట్ర వైపు వెళ్తున్నారు. మండలంలోని కౌట్ల(బి) గ్రామానికి చెంది న సాద అరుణ్(24) అనే యువకుడు తన స్కూటీ పై కౌట్ల(బి) వైపు వస్తున్నాడు. ఈ రెండు వాహనా లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.


