చికిత్స పొందుతూ బాలిక మృతి
మందమర్రిరూరల్: మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన మాసు సావిత్రి–సంతోష్ దంపతుల కుమార్తె అక్షర (14) అన్నం తిననందుకు తల్లి మందలించడంతో ఈ నెల 1న గడ్డి మందు తాగింది. తలిదండ్రులు గమనించి వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. అక్షర పొన్నారం జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతిలో టాపర్. అక్షర మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాగా, అక్షర తండ్రి మాసు సంతోష్ కాంగ్రెస్ మద్దతుతో పొన్నారం సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండడం గమనార్హం.


