దుర్వినియోగం కాకుండా చర్యలు
కార్పొరేషన్ పరిధిలో తిరిగే వాహనాలకు పెట్రోల్, డీజిల్‌ను అవసరం మేరకు మాత్రమే ప్రతీరోజు పోయిస్తాం. ఇటీవల ఒక డ్రైవర్ వాహనాన్ని తిప్పకుండా పెట్రోల్ మిగిలించి బాటిళ్లలో తీసుకుంటున్న వీడియో బయటకు రాగా, అతడిని విధులకు దూరంగా ఉంచాం. ప్రతీరోజు పెట్రోల్, డీజిల్ వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఇతర వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు.
– సంపత్‌కుమార్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్


