ఆడపిల్లల ఆరోగ్యానికి హెచ్‌పీవీ వ్యాక్సిన్
మంచిర్యాలటౌన్: ఆడపిల్లల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్ల లకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వినియోగించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో త్వరలోనే చేపట్టనున్నామని తెలిపారు. జిల్లాలో ఆడపిల్లల వివరాలు సిద్ధం చేసుకోవాలని, వారందరికీ వ్యాక్సిన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీడిపీవో విజయలక్ష్మీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ అరుణశ్రీ, బెల్లంపల్లి ఉపవైద్యాధికారి డాక్టర్ సుధాకర్‌నాయక్, డీపీవో ప్రశాంతి, జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ అఖిల్, డీపీహెచ్‌ఎం పద్మ, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీసీ సురేందర్ పాల్గొన్నారు.
నాణ్యమైన ఉచిత ఆరోగ్య సేవలు లక్ష్యం
మంచిర్యాలటౌన్: ప్రజలందరికీ నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్, డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ కౌన్సిల్ సభ్యుడు, అడ్వకేట్ మహ్మద్ సందాని, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, డీపీవో ప్రశాంతి, డెమో బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.


