‘ఆశ్రమ’ంలో అస్తవ్యస్తం..!
మంచిర్యాలఅర్బన్: మారుమూల ప్రాంతాల గిరిజ న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ల క్ష్యంతో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు నిర్వహణ లోపంతో కొట్టుమి ట్టాడుతున్నాయి. ఓ వైపు సమస్యలు నెలకొనగా.. మరోవైపు అక్రమ డిప్యూటేషన్లు ఇబ్బందిగా మారా యి. రెగ్యులర్ పోస్టింగ్‌లో కొందరు విధులు నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నచ్చిన ప్రాంతాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇంకొందరు సస్పెన్షన్‌కు గురైనా మళ్లీ అవే పాఠశాలలకు రెగ్యులర్ పోస్టింగ్ కేటాయించడం, మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపడం లాంటి చర్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. జిల్లాలో 16 ప్రీమెట్రిక్, రెండు పోస్టుమెట్రిక్ వసతిగృహాలున్నాయి. మొత్తం 2,785 మంది విద్యార్థులు వసతి పొందు తూ చదువుకుంటున్నారు. ఇందులో బాబానగర్‌లో పిల్లలేకపోవడంతో తాత్కాలికంగా మూసివేశా రు. నిబంధనలు తుంగలో తొక్కి డిప్యూటేషన్లు వేడయడంతో సరిపడా ఉపాధ్యాయుల్లేక ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల బోధనపై ప్రభావం పడుతోంది.
ఎవరిష్టం వారిదే అన్నట్లు..
ఎస్టీ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటేషన్ల ప్రక్రియ ఎవరిష్టం వారిదే అన్న చందంగా మారింది. జిల్లా కేంద్రానికి చెందిన పోస్టుమెట్రిక్ హాస్టల్ (గర్ల్స్) రెగ్యులర్ వార్డెన్‌కు లక్సెట్టిపేట ఆశ్రమ పాఠశాలకు డిప్యూటేషన్ ఇచ్చారు. జన్నారం ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను మంచిర్యాల పోస్టుమెట్రిక్ హాస్టల్‌కు డిప్యూటేషన్‌పై పంపారు. బీసీ సమీకృత హాస్టల్‌లో రెగ్యులర్ పోస్టింగ్‌తో విధులు నిర్వహించే వార్డెన్‌కు జన్నారానికి డిప్యూటేషన్ ఇచ్చారు. జన్నారం ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను కదిలించేందుకు ఈ డిప్యూటేషన్లు చేపట్టారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బీసీ సమీకృత వసతిగృహంలో బీసీ వార్డెన్‌ను సరెండర్ చేయగా ఎస్సీ వార్డెన్ మాత్రమే అన్నీ తానై చూడాల్సి వస్తోంది. ముగ్గురు వార్డెన్లు, ముగ్గురు వాచ్‌మెన్‌లు పనిచేయాల్సిన చోట ఒక్కరే ఉండడంతో పర్యవేక్షణ లోపిస్తోంది. ఇదే వసతిగృహంలో రెగ్యులర్ వాచ్‌మెన్ ఏకంగా పక్క జిల్లా సిర్పూర్(టీ) బాయ్స్ హాస్టల్‌కు డిప్యూటేషన్‌పై నచ్చిన చోటకు వెళ్లారు. బీసీ సమీకృత వసతిగృహంలో సిబ్బంది కొరత నేపథ్యంలో ఎస్టీ వార్డెన్, వాచ్‌మెన్‌ను వెనక్కి పంపిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది.


