పత్తి ఏరుతున్న కొత్త సర్పంచ్
వాంకిడి: మండలంలోని చిచ్‌పల్లి సర్పంచ్‌గా ఎన్నికైన కొర్వేత పద్మ ఎన్నికలు ముగిసిన మ రుసటి రోజే వారి చేనులో పత్తి సేకరిస్తూ కని పించింది. 2019పంచాయతీ ఎన్నిల్లోనూ స ర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందింది. ఈసారి రిజర్వేషన్ కలిసిరాగా మళ్లీ పోటీ చేసి వరుసగా రెండోసారి సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుంది. పద్మ ఇంటర్ తర్వాత డీఎడ్ పూర్తి చేసి డిగ్రీ చ దువుతోంది. వివాహానంతరం చిచ్‌పల్లికి వచ్చి న పద్మ 2019లో సర్పంచ్‌గా ఎన్నికై గ్రామస్తుల మన్ననలు పొందింది. ఈసారి 117 ఓట్ల మెజా ర్టీతో గెలిచింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా శుక్రవారం చేనులో పత్తి ఏరుతూ కనిపించింది.


