పంచాయతీ విభిన్నం
నాడు భర్త సర్పంచ్.. నేడు భార్య
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా గెలుపొందితే, ఇదే కుటుంబంలోని పలువురు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఓ చోట గతంలో భర్త సర్పంచ్‌గా గెలువగా ప్రస్తుతం భార్య ఎన్నికై ంది. మూడు విడతల్లోనూ చాలా పంచాయతీల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సర్పంచులుగానో, వార్డు సభ్యులుగానో బరిలో నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో చోటు చేసుకున్న చిత్రవిచిత్ర ఘటనల్లో కొన్ని..
జన్నారం: మండలంలోని ఏకై క మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా 2019లో భర్త గెలిస్తే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో భార్య సర్పంచ్‌గా గెలిచింది. పంచాయతీ ఎన్నికల్లో పొనకల్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా జక్కు సుష్మ గెలుపొందారు. పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలో 6,825 మంది ఓటర్లున్నారు. పొనకల్ జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జక్కు భూమేశ్ తన భార్య సుష్మను అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిపాడు. హోరాహోరీ ప్రచారంలో ప్రత్యర్థి సులువ శైలజపై 2,981 ఓట్ల మెజారిటీతో సుష్మ గెలుపొందారు. పొనకల్‌లో అత్యధికంగా ఓటర్లు ఉండటంతో అర్ధరాత్రి 12గంటల అనంతరం ఫలితాలు ప్రకటించారు. పొనకల్‌కు చెందిన అప్పాల జలపతిని ఉప సర్పంచ్‌గా వార్డు సభ్యులంతా కలిసి ఎన్నుకున్నారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు సర్పంచులుగా..
నలుగురు వార్డుమెంబర్లుగా..
ఇంద్రవెల్లి: మండలంలోని శంకర్‌గూడకు చెంది న ఒకే కుటుంబ సభ్యుల్లో ఇద్దరు సర్పంచులు గా, నలుగురు వార్డు సభ్యులుగా గెలుపొందా రు. శంకర్‌గూడకు చెందిన జాదవ్ జమునానా యక్ దనోరా (బీ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా 2ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె కూతురు జాదవ్ అనురాధ తొమ్మిదో వార్డు మెంబర్‌గా గెలుపొందారు. జాదవ్ జమునానాయక్ తోటి కోడలు జాదవ్ రోమా శంకర్‌గూడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గేడం సుజాతపై విజయం సాధించారు. శంకర్‌గూడలో జమునానాయక్ భర్త జాదవ్ హీరా లాల్ నాలుగో వార్డు మెంబర్‌గా, అదే కుటుంబానికి చెందిన జాదవ్ విజయ్‌కుమార్ శంకర్‌గూడ ఐదోవార్డు మెంబర్‌గా విజయం సాధించారు. అదే కుటుంబానికి చెందిన జాదవ్ సంధ్యారాణి శంకర్‌గూడలో ఒకటో వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సర్పంచులుగా గెలిచిన జాదవ్ జమునానాయక్, జాదవ్ రోమా
జాదవ్ జమునానాయక్ కుటుంబ సభ్యులు
నాడు తల్లిదండ్రులు.. నేడు కొడుకు
ఖానాపూర్: మండలంలోని బావాపూర్(కే) గ్రామానికి చెందిన ‘మైస’ కుటుంబీకులు గతంలో రెండు పర్యాయాలు సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించారు. తాజాగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. మైస రాజారాం 1998లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అనంతరం రాజారాం భార్య రాజు సర్పంచ్‌గా గెలుపొందింది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో గురువారం జరిగిన ఎన్నికల్లో ఎంఎస్సీ, బీఈడీ చదివిన రాజారాం రెండో కుమారుడు రాజేశ్ సర్పంచ్‌గా గెలుపొందాడు.
మైస రాజేశ్
మైస రాజారాం, రాజు దంపతులు
నాడు భర్త ఏకగ్రీవం.. నేడు భార్య విజయం
నిన్న తల్లి.. నేడు కొడుకు
ఖానాపూర్: మండలం బాదన్‌కూర్తి గ్రామానికి చెందిన పార్శపు శ్రీనివాస్ 2019లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. తాజాగా గ్రామపంచాయతీని బీసీ మహిళకు రిజర్వ్ చేయడంతో శ్రీనివాస్ తన భార్య రోహితను పోటీలో నిలుపగా ఆమె విజయం సాధించింది.
ఖానాపూర్: మండలంలోని సత్తన్‌పల్లి గ్రామానికి చెందిన సీర్ల లక్ష్మి తాజా మాజీ సర్పంచ్. ఇ టీవల సత్తన్‌పల్లి పంచాయతీని బీసీ జనరల్‌కు కేటాయించగా ఆమె కుమారుడు సీర్ల విజయ ఆనంద్ పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందాడు.
ఒక్క ఓటుతో గెలుపు
కెరమెరి: మండలంలోని పరంధోళి గ్రామపంచాయతీలో గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాతోడ్ పుష్పలతకు 202, ప్రత్యర్థి దిలీప్‌నకు 201 ఓట్లు వచ్చాయి. దీంతో పుష్పలత ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ గ్రామపంచాయతీలో 873 మంది ఓటర్లుండగా 692 ఓట్లు పోలయ్యాయి.
పంచాయతీ విభిన్నం
పంచాయతీ విభిన్నం
పంచాయతీ విభిన్నం
పంచాయతీ విభిన్నం
పంచాయతీ విభిన్నం
పంచాయతీ విభిన్నం
పంచాయతీ విభిన్నం


