బావ, మరదలు.. పోటాపోటీ
తాండూర్: మండలంలోని ఏజెన్సీ గ్రామపంచాయతీ కిష్టంపేటలో బావ, మరదలు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కిష్టంపేట ఎస్టీ జనరల్ స్థానం కావడంతో గతంలో సర్పంచ్‌గా పోటీ చేసిన సార్ల తిరుపతి బరిలో ఉన్నాడు. ప్రధాన అభ్యర్థిగా తాజా మాజీ సర్పంచ్ సార్ల తిరుపతి సోదరుడి భార్య సార్ల పద్మకు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే ఆసక్తి గ్రామంలో నెలకొంది.
సార్ల తిరుపతి
సార్ల పద్మ
బావ, మరదలు.. పోటాపోటీ


