రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి

Oct 17 2025 7:45 AM | Updated on Oct 17 2025 7:45 AM

రైతుల

రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి

● మెటాల్డిహైడ్‌ 2.5శాతం డీపీని ఎకరానికి రెండున్నర కిలోల చొప్పున సాయంత్రం పూట పొలాల్లో అక్కడక్కడ చల్లాలి. ● నత్తలు పంట పొలాల్లోకి రాకుండా చుట్టూ గడ్డ ఉప్పు చల్లాలి. నత్తలను ఏరి ఉప్పు నీటిలో వేయడంతో అవి నశించిపోతాయి. ● కిలో ఉప్పు నాలుగు లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణంలోనే గోనెసంచులు తడిపి గట్లపై ఉంచడంతో ఘాటుకు అటువైపు రావు. ● రాత్రివేళ పంట పొలాల్లో నీరు పారించకుండా పగటిపూట నీరు పెట్టాలి. గాలి వెలుతురు సోకేలా చర్యలు తీసుకోవాలి. ● జూలై నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వాటికి సంతనోత్పత్తికి అనువైన సమయం. ఆ సమయంలో రైతులంతా నివారణ చర్యలు చేపడితేనే పూర్తిగా నివారించవచ్చు.

ఎఫెక్ట్‌

నెన్నెల: మండలంలోని నందులపల్లి గ్రామంలో మండల వ్యవసాయాధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీ లించారు. పండ్లు, పత్తి, కూరగా యల తోటలకు హాని కలిగిస్తు న్న నత్తలను గుర్తించారు. ఈ నెల 12న ‘సాక్షి’లో ‘పంటలపై దండెత్తిన నత్తలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అ ధికారులు స్పందించారు. నత్తల నివారణపై రైతుల కు అవగాహన కల్పించారు. ఏఓ సృజన మాట్లాడు తూ ఉద్యాన, వ్యవసాయ పంటలపై ఆశించి విపరీ తంగా నష్టం కలిగిస్తున్న నత్తలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామూహిక నివా రణ చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు.

రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి1
1/1

రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement