
డైట్ సక్రమంగా అందించాలి
లక్సెట్టిపేట: రోగులకు డైట్‌ను సక్రమంగా అందించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూ డాలని అన్నారు. సిబ్బంది సమయపాలన, పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యల కొరత ఉందని, నూతన వైద్యులను త్వరలోనే నియమిస్తామని అన్నారు. సిబ్బంది హాజరు రిజిష్టర్ వివరాలను నమోదు చేసుకున్నారు. నూతన ఆసుపత్రి భవనం నిర్మాణం తర్వాత రోగుల సంఖ్య పెరిగింద ని, ఐపీ, ఓపీ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చె ప్పారు. రోగులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని, మెనూ పాటించాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి.. రికార్డులు, పరిసరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ యూనుస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.