
బాధితులకు భరోసా కల్పించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ వారికి భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. గురువా రం ఆయన హాజీపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశా రు. పోలీస్ సిబ్బంది సమస్యలు, విధులు, పని తీరుపై తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలు, స్టేషన్ పరిధిలో జరిగే నేరాలు, రౌడీషీటర్లు తదితర వాటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విజిబుల్ పోలీ సింగ్, పెట్రోలింగ్ విధులు బాధ్యతగా నిర్వర్తించా లని అన్నారు. మంచిర్యాల డీసీసీ ఏ.భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ పాల్గొన్నారు.
21 నుంచి అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు
మంచిర్యాలక్రైం: ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ అంబర్ కిషోర్‌ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్‌స్టేషన్లలో ఓపెన్ హౌజ్ నిర్వహించి పోలీసు విధులు, ఆయుధాలు, సాంకేతిక వినియోగం, త్యాగాలు తదితర విషయాలను తెలియజేస్తామని తెలిపారు. కానిస్టేబుల్ నుంచి పై అధికారుల వరకు పలు అంశాలపై వ్యాసరచన పోటీలు ఉంటాయని తెలిపారు. షార్ట్‌ఫిలిం తీసి 23లోగా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో అందించాలని, ఉత్తమమైన వాటిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.