
నిందితులను అరెస్ట్ చేయాలి
చెన్నూర్: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. స్థాని క ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం రోజులైనా కేసులో పురోగతి లేదని, పోలీసులు స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం 48గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని డెడ్‌లైన్ విధించి ఐదు రోజులు కావస్తున్నా పోలీసుల్లో చలనం లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. నిందితులు అధికార కాంగ్రెస్ నాయకులు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, వెంకటేశ్వర్‌రావు, నాయకులు బత్తుల సమ్మయ్య, రాపర్తి వెంకటేశ్వర్, మంత్రి రామయ్య, శివకృష్ణ, కమ్మల శ్రీనివాస్, జాడి తిరుపతి పాల్గొన్నారు.