
48 గంటల్లో అరెస్టు చేయాలి
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
వేమనపల్లి: బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులను 48 గంటల్లో అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తీవ్రవాదాన్నే ఎదుర్కొన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కవ్వింపు చర్యలకు వెరవబోదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ అరాచకాలపై పదేళ్లు కొట్లాడింది బీజేపీ నాయకులు అని గుర్తు చేశారు. ఉద్యమాలు తా ము చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని మించిన దమనకాండ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొనసాగిస్తోందని, అరాచకాలను తిప్పికొట్టే రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. యూపీ, ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాల్లో అరాచకవాదుల భరతం పడుతున్నట్లే తెలంగాణలో దౌర్జన్యాలపై బీజేపీ కొట్లాడుతుందని కి తాబిచ్చారు. బీజేపీ అంటే భద్రత, భరోసా ఇచ్చేదన్నారు. బీజేపీ నాయకులు ఆత్మహత్యలకు పాల్ప డబోరని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ప్రభుత్వ హత్యేనని విమర్శించారు.
‘బండి’ కంటతడి..
మధుకర్ ఇంటి పరిస్థితులను చూసి బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. కంటనీరు చెమర్చారు. ఇంటికి సరైన తలుపులు లేక పరదాలు కట్టుకొని జీవనం సాగిస్తున్న కడుదుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి అమ్మి కూతురు పెళ్లి చేశాడని, అలాంటి పేదరికంలో ఉండి కూడా బీజేపీకి బలమైన కార్యకర్తగా ఎదగడం నిజంగా భారతీయ జ నతా పార్టీ అదృష్టం అన్నారు. మధుకర్ కుటుంబానికి బీజేపీ రాష్ట్ర శాఖ ఎల్లవేళలా సహాయ సహ కారాలు అందిస్తుందని తెలిపారు. పోలీస్ అధికా రులు రాజకీయాలకు మడుగులొత్తడం మానుకో వాలని, వచ్చే ప్రభుత్వం బీజేపీదేనని అరాచకవాదులకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించా రు. కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, దుర్గం అశోక్, గోమాస శ్రీనివాస్, రాపర్తి వెంకటేశ్వర్లు, బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.