లక్సెట్టిపేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని కేఎస్సార్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చాలా వాగ్దానాలు చేసిందని, వాటిని అమలు చేయలేదని అన్నారు. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను విడుదల చేసి కార్యకర్తలు ప్రతీ ఒక్కరికి చేరేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నల్మాసు కాంతయ్య, నాయకులు విజిత్‌రావు, తిప్పని లింగయ్య, పొడేటి శ్రీనివాస్‌గౌడ్, పాదం శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, గంగాధర్, తిరుపతి, శ్రీకాంత్, రాజు, శ్రీనివాస్, రాయమల్లు, అనిల్ పాల్గొన్నారు.