
బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలి
● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ ● ఓటు చోరీపై సంతకాల సేకరణ
మందమర్రిరూరల్: దేశంలో ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించొద్దని, బ్యాలెట్ పత్రాల ద్వారానే ఓటింగ్ నిర్వహించాలని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పాతబస్టాండ్ కూడలి వద్ద ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై సంతకం చేసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు నోముల ఉపేందర్‌గౌడ్, సీనియర్ నాయకులు సుదర్శన్, సట్ల సంతోష్, ఆకారపు రమేష్, తిరుమల్‌రెడ్డి, నీలయ్య, రాంచందర్, జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంతకాల సేకరణ జయప్రదం చేయాలి
రామకృష్ణాపూర్: బీజేపీ చేసిన ఓట్ చోరీపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని, ఓట్‌చోరీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పిలుపునిచ్చారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఓట్‌చోరీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఓటు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరముందని అన్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, రఘునాథ్‌రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, గోపతి రాజయ్య, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్‌లో..
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలోని 12వ వార్డులో ఓటు చోరీపై కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు చెన్న నారాయణ, లింగంపల్లి మహేశ్, ఈర్ల నారాయణ, ఖదీర్, జక్కుల సత్యనారాయణ పాల్గొన్నారు.