రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

Oct 10 2025 6:36 AM | Updated on Oct 10 2025 6:36 AM

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌   పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

మంచిర్యాలఅర్బన్‌: స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి చిప్పకుర్తి జగదీష్‌ 57–60 కిలోల విభాగంలో అండర్‌–17లో బాక్సింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్మల్‌లో జరిగిన జోనల్‌ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. ఈనెల 10న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాడు. హెచ్‌ఎం బండి రమేశ్‌, పీడీ రాజయ్య గురువారం జగదీశ్‌ను అభినందించారు.

సెల్‌ఫోన్‌ చోరీకి యత్నించిన యువకుడి రిమాండ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: సెల్‌ఫోన్‌ చోరీకి యత్నించిన బీహార్‌కు చెందిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌ తె లిపారు. పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన స య్యద్‌ సాదిక్‌ అలీ బుధవారం సాయంత్రం రైతుబజార్‌లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వె ళ్లాడు. ఆ సమయంలో షేక్‌ అజ్మీర్‌.. సయ్యద్‌ సాది క్‌ అలీ జేబులోని సెల్‌ఫోన్‌ చోరీకి ప్రయత్నించాడు. గమనించిన సాదిక్‌ అలీ అతన్ని పట్టుకుని పో లీసుస్టేషన్‌లో అప్పగించారు. ఆయన ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

ఎలకి్ట్రక్‌ వాహనం బ్యాటరీల చోరీ

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని భుక్తాపూర్‌లో షా హిద్‌ అహ్మద్‌ తవక్కల్‌ ఇంటి ముందున్న ఎలకి్ట్రక్‌ వాహనం నుంచి బ్యాటరీలు, రెండు ఛార్జర్లు, ఆటోలో అమర్చిన రెండు బ్యాటరీలను బుధవారం రాత్రి చోరీకి గురయ్యాయి. బాధితుడి షాహిద్‌ అహ్మద్‌ ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా వడ్డెర కాలనీకి చెందిన మంజుల ఈశ్వర్‌ను గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అతని నుంచి బ్యాటరీలు, ఛార్జర్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

జిల్లాస్థాయి టెబుల్‌ టెన్నీస్‌ పోటీల్లో ప్రతిభ

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ముల్కల్ల జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో అండర్‌–17, 14 బాల, బాలికల జిల్లాస్థాయి టెబుల్‌ టెన్నీస్‌ పోటీలను జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్‌ గురువారం ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి దాదాపు 60 మంది వి ద్యార్థులు పాల్గొన్నారు. అండర్‌–14 బాలుర విభా గంలో ప్రథమ స్థానంలో సుప్రతిక్‌వర్మ(అల్ఫోర్‌ మంచిర్యాల), ద్వితీయ స్థానంలో సాయిశృత్విక్‌(ముల్కల్ల జెడ్పీ పాఠశాల), బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో సాద్వి(ఓరియంట్‌ దేవాపూర్‌ పాఠశాల), ద్వితీయ స్థానంలో సాన్విశ్రీ, శ్రావణి(కార్మల్‌ పాఠశాల–మంచిర్యాల)లు నిలిచారు. అండర్‌–17 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో సాయివివేక్‌(ఎంజేపీ–లక్సెట్టిపేట), ద్వితీయ స్థాన ంలో ధనుష్‌(ఎంజేపీ–లక్సెట్టిపేట), బాలికల విభా గంలో ప్రథమ స్థానంలో సత్యచతుర్వేది(కార్మల్‌ పాఠశాల–మంచిర్యాల), ద్వితీయ స్థానంలో నక్షత్ర(ఓరియంట్‌ దేవాపూర్‌ పాఠశాల) నిలిచారు. వీరు త్వరలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జరగబోయే జోనల్‌ స్థాయి టేబుల్‌ టెన్నీస్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. హెచ్‌ఎం రాజేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement