● ‘పరిషత్‌’ ఎన్నికలకు బ్రేక్‌ ● నామినేషన్ల వేళ నిలిచిన ప్రక్రియ ● రాజకీయ నాయకులు, అభ్యర్థుల్లో హైరానా | - | Sakshi
Sakshi News home page

● ‘పరిషత్‌’ ఎన్నికలకు బ్రేక్‌ ● నామినేషన్ల వేళ నిలిచిన ప్రక్రియ ● రాజకీయ నాయకులు, అభ్యర్థుల్లో హైరానా

Oct 10 2025 5:52 AM | Updated on Oct 10 2025 5:52 AM

● ‘పరిషత్‌’ ఎన్నికలకు బ్రేక్‌ ● నామినేషన్ల వేళ నిలిచిన

● ‘పరిషత్‌’ ఎన్నికలకు బ్రేక్‌ ● నామినేషన్ల వేళ నిలిచిన

● ‘పరిషత్‌’ ఎన్నికలకు బ్రేక్‌ ● నామినేషన్ల వేళ నిలిచిన ప్రక్రియ ● రాజకీయ నాయకులు, అభ్యర్థుల్లో హైరానా

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. బీసీ రిజర్వేషన్ల జీవో నంబరు 9, పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. దీంతో జిల్లాలో గురువారం ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఉదయం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారం తొలి విడతలో బెల్లంపల్లి, చెన్నూర్‌ డివిజన్ల పరిధిలోని బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్‌, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి, మందమర్రి, కోటపల్లి మండలాల్లోని తొమ్మిది జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. మధ్యాహ్నం 4గంటల వరకు హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలో నామినేషన్‌ కేంద్రాల వద్ద ఒక్క రోజు ముందుగానే అధికారులు సర్వం సిద్ధం చేసి ఉంచారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. తొలిరోజు పలువురు నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్లగా జెడ్పీటీసీ స్థానాలకు ఒక్కటి కూడా దాఖలు కాలేదు. కోటపల్లి మండలం షెట్‌పల్లి ఎంపీటీసీ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం నడుచుకోనుంది. దీంతో బరిలో నిలవాలనుకున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల్లో గందరగోళంగా మారింది.

రిజర్వేషన్లు మారుతాయా?

రిజర్వేషన్లపై కేసులో హైకోర్టులో కౌంటర్‌ దాఖలుకు నాలుగు వారాల గడువు, రెండు వారాలకు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలా ముందుకెళ్తాయనేది స్పష్టత రావాల్సి ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపైనే వివాదం నేపథ్యంలో మళ్లీ పాత రిజర్వేషన్లతోనే మరోమారు నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా..? లేక హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు అప్పీలుతో పోరాటం చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఇదంతా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పాత రిజర్వేషన్లు అమలు చేస్తే జిల్లాలోని బీసీ రిజర్వు స్థానాలు ప్రభావితం కానున్నాయి. జిల్లాలో జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానంతో సహా ఆరు జెడ్పీటీసీ, ఏడు ఎంపీపీ, 30కి పైగా ఎంపీటీసీ స్థానాలు బీసీలకు రిజర్వు అయి ఉన్నాయి. వీటితోపాటు 306 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, 2,680 వార్డు సభ్యుల స్థానాల్లో భారీగా మార్పులు జరగనున్నాయి. దీంతో ఆయా స్థానాల్లో రిజర్వేషన్లు మారితే కొత్తగా రిజర్వేషన్లతో పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతోందనేది అధికార యంత్రాంగంతోపాటు జిల్లా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement