
కుక్కల దాడిలో బాలికకు గాయాలు
కాసిపేట: మండల కేంద్రంలోని ముత్యంపల్లి లో తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో శుక్రవారం వీధి కుక్కలు దాడి చేసి చిన్నారికి తీవ్రంగా గాయపర్చాయి. ఒకటో తరగతి విద్యార్థిని అక్షిత తన తల్లితో కలిసి అక్కడికి వెళ్లింది. ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేయడంతో బాలిక కిందపడిపోయింది. తల, శరీరంపై తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు కుక్కలను తరిమి చిన్నారిని కాపాడారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపినట్లు కుటుంబీకులు తెలిపా రు. కుక్కలు స్వైరవిహారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, సమస్య పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు.