మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు సజావుగా నిర్వహించాలని డీఈవో యాదయ్య సూచించారు. గురువారం జిల్లా సైన్స్ సెంటర్‌లో ఎస్‌జీఎఫ్ సమావేశం నిర్వహించారు. గతేడాది నిర్వహించిన జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోటీలు, క్రీడాకారుల వివరాలు ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ ఫణిరాజా వివరించారు. ఈ సంవత్సరం క్రీడాపోటీల నిర్వహణ వేదికలపై చర్చించారు. డీఈవో యాదయ్య క్రీడాపోటీలపై సలహాలు, సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.