
ఎన్నికల హామీలు అమలు చేయాలి
పాతమంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6వేలు, ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులకు రూ.4వేలు పింఛన్ ఇవ్వాలన్నారు. హామీలు అమలుపర్చకుంటే ఆగస్టు 13న పింఛన్‌దారులతో చలో హైదరాబాద్ మహాగర్జన చేపడుతామని అన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్, జిల్లా ఇంచార్జి పెద్దపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు అప్పారావు, మందమర్రి, లక్సెట్టిపేట మండలా అధ్యక్షులు రమేష్, దేవి ప్రకాష్ పాల్గొన్నారు.
మహారాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్‌గా అర్జున్‌రెడ్డి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని హైటెక్‌సిటీ కాలనీకి చెందిన అలుగువెల్లి తిరుపతిరెడ్డి, ప్రేమలత దంపతుల మనవడు అర్జున్‌రెడ్డి మహారాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను సాధించాడు. వీరు నాందేడ్‌లో స్థిరపడగా, బ్యాడ్మింటన్‌లో రాణిస్తూ ఇప్పటికే పలు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయిలో చాంపియన్‌గా నిలవడంపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అండర్–19 విభాగంలో అర్జున్‌రెడ్డి(16) వచ్చే సెప్టెంబర్‌లో జరిగే జోనల్స్‌లో పాల్గొంటారని కోచ్ భాస్కర్‌బాబు తెలిపారు.