
నానోనే నయం
● ద్రవరూప యూరియాతో పైరుకు మేలు ● సాగు ఖర్చు తగ్గి.. పెరగనున్న దిగుబడి ● విరివిగా ప్రచారం చేస్తున్న అధికారులు ● రైతులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం
నిర్మల్‌చైన్‌గేట్: ఖరీఫ్ సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. వివిధ పంటల్లో దశలవారీగా ఉపయోగించే యూరియా కొరత రైతులను వేధిస్తోంది. అవసరానికి సరిపడా కోటా రాకపోవడం, వచ్చినా కొన్నిచోట్ల డీలర్లు మాయాజాలం ప్రదర్శిస్తుండడం.. ఇంకొన్ని చోట్ల భవిష్యత్‌లో కొరత వస్తుందని రైతులు ముందుగా కొనుగోలుకు సిద్ధమవుతుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గుళికల యూరియాకు బదులు నానో (ద్రవరూపం) యూరియా వాడాలని చెబుతూనే దీ నితో కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఖర్చు తగ్గడమే కాకుండా ఫలితం బా గుంటుందని, రవాణా సులువవుతుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రైతులు నానో యూరియా వాడకానికి ముందుకువస్తున్నారు. అయితే, అధికారులు మరింత విస్తృత ప్రచారం చేస్తే అధికసంఖ్యలో రైతులు నానో యూరియా వైపే మొగ్గుచూపే అవకాశముంది.
గుళికల యూరియా కంటే ధర తక్కువే..
నానో యూరియా ఒక్క బాటిల్ (500 మి.లీ).. 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానమని చెబుతున్నారు. 45కిలోల యూరియా బస్తా ధర రూ.270 కాగా, అర లీటర్ నానో యూరియా రూ.225కే లభిస్తుంది. నత్రజనిని అందించే ఈ ఎ రువు ద్వారా మొక్కల్లో పచ్చదనం, చురుకైన పెరుగుదల నమోదవుతుందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు నత్రజనిని అందించేలా రైతులు గుళికల యూరియాను 2–3 సార్లు పైపాటుగా వేస్తున్నారు. ఇందులో నత్రజనిని 30–50 శాత మే పంట వినియోగించుకుంటోంది. మిగతాదంతా వృథా అవుతోంది. లేదా నేల, గాలి, నీటిని కలుషి తం చేస్తోంది. అదే నానో ఎరువు వాడకంతో ఇలాంటివేవీ జరగవు.
బహుళ ప్రయోజనకారిగా..
నానో యూరియా కణాలు చిన్నవిగా ఉండడంతో పంటకు 80 శాతం కన్నా ఎక్కువగా చేరుతుంది. మొక్కలకు నత్రజని అవసరాన్ని సమర్ధవంతంగా తీరుస్తూ ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియను పెంచుతుంది. వేర్లలో కణజాలం వృద్ధికి ఉపయోగపడుతుంది. సంప్రదా య యూరియాతో పోలిస్తే 50 శాతం, అంతకంటే తక్కువే అవసరమవుతుండడంతో రైతులకు ఖర్చు తగ్గుతుంది. అంతే కాకుండా గుళికల యూరియా బస్తాల రవాణా భారం తగ్గుతుంది. 500 మి.లీ నా నో యూరియా బాటిల్ సులభంగా ఎక్కడికై నా తీ సుకెళ్లవచ్చని అధికారులు అవగాహన కల్పిస్తున్నా రు. ఇది లీటర్ నీటికి 2–4 మి.లీ. కలిపి పంట చు రుకైన ఎదుగుదల దశలో ఆకులపై పిచికారీ చే యా లి. ఎకరాకు లీటర్ నానో యూరియా సరిపోనుండగా, పంట వేసిన 20–25 రోజుల్లో ఓసారి, 20–25 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ యూరియా ద్రవరూపంలో ఉండడంతో ఆకులపై పిచికారీ చేసినప్పుడు రంధ్రాల ద్వారా సు లభంగా లోనికి వెళ్తూ మొక్క అన్ని భాగాలకు చేరుకుంటుంది. అవసరం మేరకు మొక్కలు పీల్చుకున్నాక మిగతాది మొక్కల ఇతర భాగాల్లో నిల్వ చే యబడి అవసరమైనప్పుడు విడుదలవుతుంది.
అవగాహన కల్పించాలి
ఇన్నాళ్లుగా పంటలకు గుళికల రూపంలో ఉన్న యూరియా వాడుతున్నాం. ఒక్కోసారి యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నాం. గుళికల యూరియా కు బదులు ద్రవరూపంలో ఉన్న నానో యూరియా వాడాలని అధికారులు చెబుతున్నారు. కానీ.. అది పంటలకు ఎలా ఉపయోగపడుతుందో రైతులకు పంట చేన్ల వద్ద వివరిస్తే అర్థమవుతుంది. – సాయన్న,
పెంచికల్‌పహాడ్, కుంటాల మండలం
దిగుబడి పెరుగుతుంది
గుళికల ఎరువు కంటే నానో ఎరువులు చాలా మేలైనవి. వరి నాటుకు ముందుగా ఒకసారే నానో డీఏపీని పొలంలో పిచికారీ చేయాలి. అలాగే నానో యూరియాను లీటర్ నీటికి 2మి.లీ. లేదా 4మి.లీ. చొప్పున కలిపి మొదట పంట పెరుగుదల దశలో, తర్వాత నెలలోపు పూత దశలో పిచికారీ చేయాలి. దీంతో సుమారు 8శాతం పంట దిగుబడి పెరుగుతుంది.
– నాగరాజు, ఏవో, నిర్మల్

నానోనే నయం

నానోనే నయం

నానోనే నయం