
అదనపు కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్య శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించగా.. తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, సిబ్బంది స్వాగతం పలికారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదానికి సూచనలు అందించారు. వీలైనంత త్వరగా పరిశీలించి పై అధికారులకు నివేదించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు. గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ అండర్ టన్నెల్‌లోకి వెళ్లి పనితీరును పరిశీలించారు. నాయబ్ తహసీల్దార్ అతీశ్, సీనియర్ అసిస్టెంట్ రంజిత్, గిర్దావర్లు ప్రభు, మంగ పాల్గొన్నారు.