
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
తాండూర్/బెల్లంపల్లిరూరల్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం తాండూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, బెల్లంపల్లి మండలంలోని కేజీబీవీ, తెలంగాణ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు, తరగతి గదులు, మూత్రశాలలు, వంటగదులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, మంచినీరుతోపాటు ఏవైనా సమస్యలు ఉన్నాయని వి ద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించా లని, ఉత్తమ ఫలితాలు సాధించేలా మెరుగైన విద్యాబోధన చేయాలని తెలిపారు. పారిశుద్ధ్యం లోపించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాండూర్‌లో ఇంటర్మీడియట్ కళాశాల భవనంపై అదనపు గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాండూర్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ మల్లేశం, కేజీబీవీ ప్రత్యేక అధికారి కవిత, బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్, ఎంఈవో జాడి పోచయ్య, గురుకుల పాఠశాల, కేజీబీవీ ప్రధానోపాధ్యాయులు సత్తయ్య, రజిత, ఏఈఈ వినయ్ పాల్గొన్నారు.
వెంకట్రావుపేటలో బర్డ్‌వాక్
లక్సెట్టిపేట: లక్సెట్టిపేట అటవీ రేంజ్ వెంకట్రావుటపేట చెరువు వద్ద శుక్రవారం అటవీ అధికారులు బర్డ్‌వాక్ చేశారు. మహారాష్ట్రలోని యావత్మాల్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ రంజాన్ ఇరాని పాల్గొన్నారు. ఇండియన్ స్పాట్ బిల్‌డ్ డక్, ఎరోసియన్ కూట్, విజిటింగ్ డక్స్‌లు కనిపించినట్లు రేంజ్ అధికారి అత్తె శుభాష్ తెలిపారు. పక్షులను పర్యవేక్షించి వాటి వివరాలు సేకరిస్తే అవగాహన పెరుగుతుందని వైల్డ్‌లైఫ్ వార్డెన్ సిబ్బందికి సూచించారు. ఈ ప్రాంతంలో అనేక రకాల పక్షులున్నాయని, వాటిని గుర్తించి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సెక్షన్ అధికారు అల్తాఫ్ హుస్సెన్, బీట్ అధికారులు చంద్రశేఖర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.