
ఎరువులు పంపిణీ చేయాలని ధర్నా
కోటపల్లి: రైతులకు సరిపడా ఎరువుల బస్తాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం కోటపల్లిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారమేష్ మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు ఆధార్‌కార్డులు, చెప్పులు వరుసలో ఉంచి నాలుగైదు రోజులు పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. సకాలంలో ఎరువులు ఇవ్వలేని మంత్రి వివేక్ రాజీనామా చేయాలని అన్నారు. ఎస్సై రాజేందర్ ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సాంబగౌడ్, యూత్ అధ్యక్షుడు విద్యాసాగర్, మాజీ జెడ్పీటీసీ తిరుపతి, మాజీ ఎంపీపీ బాపు, మాజీ సర్పంచ్ కృష్ణ, మాజీ కౌన్సిలర్ రెవెల్లి మహేశ్, నాయకులు స్వామి, భారతి, చిరంజీవి, నాయబ్, సంపత్ పాల్గొన్నారు.