
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
భీమిని: గ్రామాల్లో సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డి ప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్ ఆదేశించారు. గురువా రం మండల కేంద్రంలో భీమిని, కన్నెపల్లి మండలాల వైద్య సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వ్యాపించే అవకాశం ఉందని, ఈ వ్యాధులు రావడానికి దోమలే కారణమని, దోమలు విజృంభించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అనిల్‌కుమార్ సీఎచ్‌వోలు వెంకటేశ్వర్లు, జలపతి, సుపర్‌వైజర్ ఇందిరా, హెల్త్ అసిస్టెంట్ ఉమశంకర్, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీసీలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.