
పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
నెన్నెల: వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు కార్యదర్శులకు సూచించారు. గురువారం గన్‌పూర్, గొల్లపల్లి, మైలారం గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. రికార్డులు, పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. గన్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎంపీఓ శ్రీనివాస్, కార్యదర్శులు పద్మనాభం, సాయితేజ, వనిత పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 150మందికి లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. క్లబ్ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, సభ్యులు సుధారాణి, వి.మధుసూదన్‌రెడ్డి, హన్మంతరావు, గోలి రాము, గుండా శ్రీనివాస్, బాలమోహన్, చందూరి మహేందర్, జ్యోత్స్న, హెచ్‌ఎం పద్మ పాల్గొన్నారు.