భీమిని: పాస్‌బుక్‌కు ఒక బస్తా యూరియా ఇస్తామని వ్యవసాయ అధికారులు చెప్పడంతో కన్నెపల్లిలో రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ఏడీఏ సురేఖ అక్కడికి చేరుకుని రైతులు ఆందోళన చెందవద్దని, యూరియా కొరత ఉందని తెలిపారు. ఫర్టిలైజర్ దుకాణాలు, డీసీఎంఎస్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వారి ఖాతాదారులకు ఇస్తున్నారని రైతులు తెలిపారు. దీంతో ఆమె హకా, డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడి రైతులకు యూరియా ఇవ్వాలని సూచించారు. టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయాలని ఏఈవోకు సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కన్నెపల్లిలోని ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. వీగాం, కన్నెపల్లి, ముత్తాపూర్ గ్రామాల్లో దుకాణాలు తనిఖీ చేశారు. ఎమ్మార్పీకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. కన్నెపల్లి, భీమిని, నెన్నెల ఏవోలు సాయిప్రశాంత్, యమునదుర్గా, సృజన పాల్గొన్నారు.