
నిత్యస్ఫూర్తి..
నిర్మల్: మా నాన్న నాళం సాయన్న అంటే.. ఫిజిక్స్ లెక్చరర్‌గా అందరికీ తెలుసు. జూనియర్ లెక్చరర్‌గా సేవలందించి, ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. విధినిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా.. మా గురించి రోజూ ఆలోచించేవారు. తన తపనకు తగ్గట్లుగా మంచి స్థానాల్లో స్థిరపడ్డాం. నన్ను డాక్టర్‌ను చేసిన నాన్న ఇప్పటికీ ఆస్పత్రిలో నిత్యం సహకరిస్తున్నారు. నేను నా పిల్లలతో ఎలా ఉండాలోనన్న నిత్య స్ఫూర్తినిస్తున్నారు.
– నాళం శశికాంత్, జనరల్ సర్జన్, నిర్మల్
నాన్న స్ఫూర్తితోనే..
నిర్మల్: ‘మెదడుకు పదును’ అంటూ చిన్నప్పుడు నాన్న నాకిడి గంగన్న మాకు అందుబాటులో ఉంచిన పుస్తకాలు, తను చెప్పిన మాటలే ఇవ్వాళ్ల ఐఆర్‌ఎస్ అధికారిని చేశాయి. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా నాన్న అడ్మినిస్ట్రేషన్‌ను దగ్గరుండి చూశాను. అంత బిజీగా ఉంటున్నా.. నాన్న మా గురించి నిత్యం ఆలోచించేవారు. తన స్ఫూర్తితోనే సివిల్స్‌లో ఆలిండియా 293ర్యాంక్ సాధించగలిగాను. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కస్టమ్స్ అండ్ సీజీఎస్‌టీ అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా.. నాన్న ఆదర్శాలు నిత్యం నన్ను నడిపిస్తూనే ఉంటాయి.
– నాకిడి సృజన్, అడిషనల్ కమిషనర్, కస్టమ్స్ అండ్ సీజీఎస్‌టీ, గుజరాత్

నిత్యస్ఫూర్తి..