
హాకీ చాంపియన్‌గా ‘హైదరాబాద్’
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్ జట్టుతో జరిగిన పోరులో 3–0 గోల్స్‌తో విజయదుందుభి మోగించింది. రెండో స్థానంలో నిజామాబాద్, మూడో స్థానంలో నల్గొండ జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్‌కుమార్, జనరల్ సెక్రటరీ సీఆర్ భీంసింగ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, యూనుస్ అక్బాన్, రాష్ట్రపాల్, క్రీడాకారులు, శిక్షకులు పాల్గొన్నారు.