
బస్టాండ్ బాత్రూంలో బోనోఫిక్స్ కలకలం!
● మత్తు కోసం వినియోగిస్తున్న యువత
ఖానాపూర్: మద్యం, గుట్కాతో పాటు గంజాయి లాంటి పలు మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే తరహాలో సైకిల్ టైర్ పంక్చర్ కోసం వినియోగించే బోనోఫిక్స్‌తో ద్వారా మత్తును ఆస్వాదిస్తున్న ఘటన ఖానాపూ ర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మరుగుదొ డ్లు, మూత్రశాలల ప్రాంతంలో బోనోఫిక్స్ వినియోగించి పడేసిన ఖాళీ కవర్లు కనిపించాయి. ఈ ఘట న తెలియడంతో పట్టణవాసులు, విద్యార్థుల తల్లి దండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నా రు. దుకాణాల్లో కొనుగోలు చేసిన బోనోఫిక్స్‌ను కర్చీఫ్‌లు, కవర్లలో వేసుకుని యువత మత్తు కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బోనోఫిక్స్ పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు చెడిపోవడంతో పాటు ఇతర వ్యాధులు వస్తాయని, సైడ్‌ఎఫెక్ట్‌లకు దారితీసే ప్ర మాదముందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి కై నా సంబంధిత అధికారులు బోనోఫిక్స్ విక్రయాలపై నిఘా పెట్టాలని, యువతకు దురలవాట్లపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.