బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

Jun 10 2025 3:28 AM | Updated on Jun 10 2025 3:28 AM

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సమష్టిగా కృషి చేద్దామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్‌ అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్‌తో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏళ్లలోపు పిల్లలతో పని చేయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల కార్మికుల సమాచారాన్ని 1098 నంబరులో అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌వో రామ్మోహన్‌, డీసీపీవో ఆనంద్‌, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌ హెల్ప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement