
సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ ఉద్యోగులను ప్ర భుత్వంలో విలీనం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ముఖ ద్వారం వద్ద ఈ నెల 7న ఆర్టీసీలో తలపెట్టిన సమ్మె వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిపో కన్వీనర్ గోలి శంకర్, కో–కన్వీనర్ సేని తిరుపతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.