
ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య, పూర్తిస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. గురువారం స్థానిక సైన్స్ కేంద్రంలో మండల విద్యాధికా రులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల వి ద్యాశాఖ కార్యక్రమాలను ప్రతీ విద్యార్థి పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా బాధ్యత తీ సుకోవాలని అన్నారు. విద్యార్థులు, భయం, ఒత్తిడి లేకుండా విద్య నేర్చుకునే అవకాశం క ల్పించడానికి సమన్వయంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. సమయానికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ అందేలా చూడాలన్నారు. రాబోయే విద్యాసంవత్సరంలో అమలు చేయాల్సిన వినూత్న కార్యక్రమాలు అవగాహన కలిగి ఉండాలఅన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు చౌ దరి, యశోధర, శ్రీనివాస్, సత్యనారాయణ మూర్తి, డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, ఏఎస్సీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
రైతులకు సౌకర్యాలు
కల్పించాలి
లక్సెట్టిపేట: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని విధాల సౌకర్యాలు క ల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. గురువారం మండలంలోని కొత్తూ రు, ఇటిక్యాల, మోదెల, చందారం, కొమ్ముగూడెం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులున్నా తెలియజేయాలన్నారు. ధా న్యాన్ని శుభ్రపరిచి తీసుకురావాలని, నాణ్య మైన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని, నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.